: బాలీవుడ్ తెరంగేట్రం చేయనున్న ఆసీస్ మాజీ క్రికెటర్


ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ బాలీవుడ్ సినిమాల పిచ్చి అందరికీ తెలిసిందే. సంవత్సరంలో మూణ్ణాలుగు పర్యాయాలు భారత్ కు వస్తుంటాడు. కొన్నాళ్ళ క్రితం క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ స్పీడ్ స్టర్ బహుముఖ ప్రజ్ఞావంతుడు. మంచి గిటారిస్టే కాకుండా, నటుడు కూడా. అన్నింటికి మించి, బాలీవుడ్ సినిమాలకు వీరాభిమాని. హిందీ చిత్రాల్లో నటించాలని ఉందని ఎన్నోమార్లు బహిరంగంగా ప్రకటించాడు. ఇప్పుడతని కల నెరవేరబోతోంది. త్వరలోనే బ్రెట్ లీ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రొడక్షన్ పనులు అక్టోబరులో ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రం షూటింగ్ సిడ్నీలో జరగనుందని సమాచారం. ప్రస్తుతం లీ ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ వెంట భారత్ లో పర్యటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News