: కేసీఆర్ తో సమావేశమైన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూతో కూడిన బృందం ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల గురించి తెలుసుకున్న బ్రిటన్ ప్రతినిధులు కేసీఆర్ ను అభినందించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అమలుకు బ్రిటన్ సహకరించాలని ఈ సందర్భంగా కేసీఆర్ వారిని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని వారు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యారంగంలో సమూల మార్పులు చేస్తామని, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని కేసీఆర్ బ్రిటన్ ప్రతినిధులకు తెలిపారు. సాలార్ జంగ్ మ్యూజియాన్ని బ్రిటిష్ మ్యూజియాల తరహాలో తీర్చిదిద్దుతామని కేసీఆర్ చెప్పారు.