: సెన్సార్ బోర్డుపై దీపిక రుసరుసలు


బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే సెన్సార్ బోర్డుపై రుసరుసలాడింది. 'ఫైండింగ్ ఫన్నీ' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె సెన్సార్ బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు మార్గదర్శకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. 'ఫైండింగ్ ఫన్నీ' సినిమాలో 'వర్జిన్ (కన్య)' అనే పదాన్ని తొలగించడం సరికాదని దీపికా తెలిపింది. సెన్సార్ బోర్డుకు సరైన నిబంధనలు లేవని అన్న ఆమె, ప్రతి ఆరు నెలలకొకసారి నిబంధనలు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపేటప్పుడు ఆ చిత్రానికి, సీన్ కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అభ్యంతరం చెబితే అందుకు కారణాలు కూడా వెల్లడించాలని ఆమె డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News