: శ్రీచైతన్య స్కూల్లో సహవిద్యార్థి గొంతులో పొడిచిన స్నేహితుడు


తిరుపతిలోని గాంధీరోడ్డులో ఉన్న శ్రీచైతన్య స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య జరిగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మోహన కృష్ణారెడ్డి అనే విద్యార్థిని మరో విద్యార్థి గాజు గ్లాసుతో గొంతులో పొడిచాడు. గ్లాసు గొంతులో దిగిపోవడంతో తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డి మృతి చెందాడు. పోలీసుల సహకారంతో దీనిని దాచేందుకు శ్రీచైతన్య యాజమాన్యం ప్రయత్నించిందని, తమకు సమాచారమివ్వడంలో అలసత్వం ప్రదర్శించిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులిద్దరూ పదో తరగతి చదువుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News