: ప్రైవేటు స్కూళ్లకు కేరళ సర్కారు అల్టిమేటం


కేరళ ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రదేశాల్లో ప్రైవేటు స్కూళ్లను నడుపుతుండడంతో, అక్కడ మౌలిక వసతులు ఉండడం లేదని గుర్తించిన కేరళ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థులకు అవసరమైనన్ని మరుగుదొడ్లు లేని ప్రైవేటు స్కూళ్లకు ఫిట్ నెస్ సర్టిఫికేట్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. మరుగుదొడ్లు లేని ప్రైవేటు స్కూళ్లు వంద రోజుల్లోగా వాటిని నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు విధిగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా 196 ప్రభుత్వ పాఠశాలలు, 1011 ప్రైవేటు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని విషయాన్ని విద్యాశాఖ గుర్తించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News