: ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా సతీష్ రెడ్డి ఏకగ్రీవం


ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నూతన డిప్యూటీ ఛైర్మన్ గా సింగారెడ్డి వెంకట సతీష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ చక్రపాణి ఆయన పేరును ప్రకటించారు. అనంతరం సతీష్ రెడ్డిని ఆసనం వరకు సభ్యులు తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికయిన సతీష్ రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. అటు, ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించి వారికి కావల్సిన సరైన పాలన అందించే విధంగా డిప్యూటీ ఛైర్మన్ దోహదపడాలని నారాయణ కోరారు.

  • Loading...

More Telugu News