: ఎర్రబెల్లి సవాలును స్వీకరించిన మంత్రి హరీశ్ రావు
మెదక్ లోక్ సభ స్థానం ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు... టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావుకు ఓ సవాల్ విసిరారు. మెదక్ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే హరీశ్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎర్రబెల్లి అన్నారు. దీనికి చురుగ్గా స్పందించిన హరీశ్, ఈ సవాల్ ను తాను స్వీకరిస్తున్నాననీ, ఒకవేళ జగ్గారెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు ఎర్రబెల్లి సిద్ధమా? అని ప్రతి సవాల్ విసిరారు.