: ఆ బ్యాంకుపై కేసు వేస్తా: విజయ్ మాల్యా
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కేసు వేస్తానని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హెచ్చరించారు. బ్యాంకు 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'గా తన పేరు ప్రకటించడంపై విజయ్ మాల్యా మండిపడ్డారు. డిఫాల్టర్ ట్యాగ్ ను తాను అంగీకరించబోనని తేల్చిచెప్పారు. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందని ఆయన తెలిపారు.