: క్లీన్ స్వీప్ పై కన్నేసిన ధోనీ గ్యాంగ్


ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకున్న ధోనీ సేన ఐదో వన్డేలోనూ నెగ్గాలని భావిస్తోంది. తద్వారా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని తలపోస్తోంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి వన్డే రేపు లీడ్స్ లో జరగనుంది. ఈ సిరీస్ లో తొలి వన్డే వర్షార్పణం కాగా, భారత్ వరుసగా మూడు వన్డేల్లో నెగ్గి సిరీస్ ను చేజిక్కించుకోవడం తెలిసిందే. కాగా, రేపటి మ్యాచ్ నామమాత్రమైన నేపథ్యంలో, రిజర్వ్ బెంచ్ కు అవకాశమివ్వాలని టీమిండియా మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News