: విశాఖపట్నం వెళితే నేను ప్రపంచాన్ని మరిచిపోతాను: అసెంబ్లీలో చంద్రబాబు


విశాఖపట్నం నగరంపై చంద్రబాబునాయుడు అటు ప్రశంసల జల్లు, ఇటు వరాల జల్లు కురిపించారు. విశాఖ అత్యంత సుందర నగరమని... ఆ నగరానికి వెళితే తాను ప్రపంచాన్నే మరిచిపోతానని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. విశాఖపట్నం బ్రహ్మాండమైన సిటీ అని... దేశంలో ఏ నగరానికి లేని వనరులు విశాఖపట్నానికి ఉన్నాయని చంద్రబాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. భారతదేశానికే ఆర్థిక రాజధాని కాగల సత్తా విశాఖపట్టణానికే ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. మరో 'ముంబయి'గా ఎదిగే సత్తా విశాఖకు ఉందన్నారు. అందుకే, విశాఖపట్నాన్ని మెగాసిటీగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. మెట్రోరైల్ తో పాటు వైజాగ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, హార్డ్ వేర్ హబ్, వీఐసీసీ ఇండస్ట్రియల్ జోన్, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్, ఫుడ్ పార్క్ లను విశాఖపట్టణంలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News