: పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగించిన ఘనత ఎన్డీఏ సర్కార్ దే: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగించిన ఘనత ఎన్డీయే సర్కార్ దేనని అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధానిపై చర్చ సందర్భంగా శాసనసభలో చంద్రబాబు మాట్లాడుతూ... అడ్డగోలు విభజన వల్ల వచ్చిన సమస్యలపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుతో ఇప్పటికే చర్చించానని ఆయన వెల్లడించారు. సివిల్ సర్వెంట్లు, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాలేదన్నారు. పేదవాడికి కట్టెల పొయ్యిలతో కాకుండా గ్యాస్ తో వండుకునేలా ఇంటింటికీ ఎల్పీజీ సిలెండర్లు ఇచ్చిన ఘనత తమదేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా రైతు రుణమాఫీని కచ్చితంగా అమలుచేసి తీరుతామని చంద్రబాబు ప్రకటించారు.