: సొంత ప్రాంతమైన తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయాలని నాకూ ఉంది, కానీ...: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తాను స్వార్థం చూసుకోలేదని చంద్రబాబు అన్నారు. రాజధాని తిరుపతిలో ఏర్పాటు చేయాలని తనకు ఉందనీ... అయితే, వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా ప్రజాభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ప్రాంతాన్ని ఎంపిక చేశామని ఆయన ప్రకటించారు. లక్ష ఎకరాల అడవుల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఏ ప్రయోజనమూ ఉండదని ఆయన అన్నారు. రాజధానికి భూములతో పాటు...'సోషల్ లైఫ్' కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.