: తమ హీరో రవిశాస్త్రే అంటున్న టీమిండియా ఓపెనర్
టీమిండియా జట్టు తాజా ప్రదర్శనపై ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. కుక్ సేనతో వన్డేల్లో మెరుగైన ఆటతీరు కనబర్చడానికి కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రే కారణమని అన్నాడు. టెస్టు పరాభవం నుంచి పుంజుకోవడంలో రవి ఎంతగానో తోడ్పడ్డారని తెలిపాడు. ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ గెలవడంలో అతను ఎనలేని ఆత్మవిశ్వాసం అందించాడని కొనియాడాడు. మరికొన్ని నెలల్లో వన్డే వరల్డ్ కప్ ఉందనగా, వన్డే సిరీస్ నెగ్గడం కొత్త శక్తిని అందించిందని అన్నారు.