: నా నియామకంలో ఎలాంటి వివాదం లేదు: కేరళ గవర్నర్ సదాశివం


కేరళ గవర్నర్ గా తనను కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ పి.సదాశివం సమర్ధించుకున్నారు. ఈ మేరకు మాట్లాడుతూ, "నాలుగు నెలల కిందట నేను రిటైర్ అయ్యాను. కాబట్టి, నన్ను రాష్ట్ర గవర్నర్ గా నియమించడంలో ఎలాంటి వివాదం లేదు" అని ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాతో తెలిపారు. ప్రస్తుతానికి తాను సాధారణ మనిషినని, పలు సంవత్సరాల తన అనుభవాన్ని కేరళ ప్రజలకు లాభం కలిగేలా ఉపయోగిస్తానని చెప్పారు. తనకున్న సుదీర్ఘ అనుభవం వల్లే ఆ రాష్ట్రానికి సేవ చేసేలా ప్రస్తుతం మంచి పదవి వచ్చిందన్నారు. అయితే, తనది రాజకీయ నియామకమంటూ వస్తున్న విమర్శలను తోసిపుచ్చిన సదాశివం... ఉన్నత న్యాయస్థానం నుంచి ఓ వ్యక్తి గవర్నర్ గా నియమితులవడం పట్ల న్యాయవ్యవస్థ కూటమి తప్పకుండా ఆనందిస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News