: యూఎస్ ఓపెన్ ఫైనల్లో సానియా, సొరెస్ జోడీ


భారత నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్రెజిలియన్ ఆటగాడు బ్రూనో సొరెస్ జోడీ యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో ఫైనల్స్ కు చేరింది. తైవాన్, బ్రిటన్ కు చెందిన అన్ సీడెడ్ చాన్-హచిన్స్ జోడీపై 7-5, 4-6, 10-7 తో సానియా జోడీ గెలుపొందింది. ఇక, ఫైనల్లో అమెరికన్, మెక్సికన్ జోడీతో సానియా జోడీ తలపడనుంది. అటు, మహిళల డబుల్స్ లో జింబాబ్వే భాగస్వామి కారా బ్లాక్ తో కలసి సానియా సెమీఫైనల్లో ఉంది.

  • Loading...

More Telugu News