: శాసనసభలో 'డెమోక్రసీ' మాత్రమే ఉంది, 'జగనోక్రసీ'లేదు: యనమల తీవ్ర వ్యాఖ్యలు
శాసనసభలో 'డెమోక్రసీ' మాత్రమే ఉందని... 'జగనోక్రసీ' లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శాసనసభలో సీఎం అయినా, ప్రతిపక్షనాయకుడైనా నియమాలు పాటించించాల్సిందేనని అన్నారు. వైఎస్ జగన్ చెప్పినట్టు శాసససభ నడవాలంటే కుదరదని ఆయన అన్నారు. శాసనసభకు కొన్ని నియమాలున్నాయని... వాటి ప్రకారమే సభ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సభ అంటే లోటస్ పాండ్, ఇడుపులపాయ కాదని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయాల కోసమే రాజధాని విషయాన్ని వైసీపీ వివాదస్పదం చేస్తోందని అన్నారు. రాజధానిపై ప్రకటన తర్వాత వైసీపీ సభ్యులు తమ డిమాండ్ ను తెలియజేయాలన్నారు.