: వారణాసిలో ‘ఫ్లిప్ కార్ట్ కారిగార్ కా ద్వార్’ ప్రారంభం


కేంద్ర ప్రభుత్వం, దేశీయ ఈ-రీటెయిల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందిన ‘ఫ్లిప్ కార్ట్ కారిగార్ కా ద్వార్’ బుధవారం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో ఈ-రీటెయిలర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగరంలోని 40 వేలకు పైగా ఉన్న చేనేత కార్మికులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఫ్లిప్ కార్ట్ రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న వారణాసిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలన్న కేంద్రం ప్రతిపాదనకు అనుగుణంగానే ఫ్లిప్ కార్ట్ సన్నాహాలు చేసింది. అయితే ఈ-రీటెయిలింగ్ రంగంలో చాలా సంస్థలున్నప్పటికీ ఒక్క ఫ్లిప్ కార్ట్ కే అనుమతివ్వడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ‘ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు’ అని ఫ్లిప్ కార్ట్ కార్పోరేట్ హెడ్ జాయ్ బండేకర్ ప్రకటించారు. ఫ్లిప్ కార్ట్ చర్యతో బుధవారం నుంచి వారణాసి చేనేత కార్మికుల ఉత్పత్తులు ఆన్ లైన్ మార్కెట్ లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

  • Loading...

More Telugu News