: రాహుల్ నాయకత్వం మీద సందేహం లేదు: కాంగ్రెస్
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ కొట్టిపారేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శోభా ఓజా మాట్లాడుతూ, "రాహుల్ జీ మా నేత. ఆయన నాయకత్వంలోనే పార్టీ పనిచేస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తాం. రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై ఎలాంటి సందేహాలు లేవు" అన్నారు. తమ పార్టీ భవిష్యత్ నాయకుడు రాహుల్ గాంధీయేనని, ఆయన నాయకత్వంలోనే పార్టీ పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.