: మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
అందుబాటులో ఉన్న మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సమావేశమయ్యారు. రేపు అసెంబ్లీలో రాజధానిపై చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో రేపు వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చించినట్లు సమాచారం.