: చేతిలో సినిమాలు లేవు... వ్యభిచారం చేయకుండా ఇంకేం చేయాలి?: శ్వేతబసుప్రసాద్


సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆదాయమార్గం మూసుకుపోయింది. దీంతో కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో మార్గం లేక వ్యభిచారంలోకి దిగానని జాతీయ అవార్డు పొందిన సినీ నటి శ్వేతబసుప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తాను ఎన్నుకున్న మార్గం తప్పుడు మార్గమన్న సంగతి తనకు తెలుసని అన్నారు. చేతిలో డబ్బులు అయిపోయాయని, కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉండడంతో సరైన విద్యార్హతలు లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదని ఆమె తెలిపింది. నిస్సహాయ స్థితిలో ఉన్న తాను తప్పనిసరి పరిస్థితుల్లో కొంత మంది ప్రోత్సాహంతో వ్యభిచార వృత్తిలోకి దిగానని ఆమె పేర్కొన్నారు. తనలాగే మరి కొంతమంది నటులు కూడా ఇదే మార్గాన్ని ఎన్నుకున్నారని ఆమె తెలిపారు. కాగా, వ్యభిచార కేసులో పట్టుబడిన శ్వేతబసుప్రసాద్ మూడు నెలలపాటు రెస్క్యూహోంలో ఉండే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News