: చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతిలో కిషన్ రెడ్డి కీలుబొమ్మ: హరీష్ రావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతిలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలుబొమ్మగా మారారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ ఉప ఎన్నిక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లికి రోషం ఉంటే ఆంధ్రా బాబుకు వత్తాసు పలకడం మానాలని ఆయన అన్నారు. సమైక్యవాది జగ్గారెడ్డిని ఎలా బలపరుస్తారని ఆయన టీడీపీ, బీజేపీ నేతలను ప్రశ్నించారు.