: నన్ను గెలిపిస్తే తాగునీటి కోసం రూ.200 కోట్లు తెస్తా: జగ్గారెడ్డి
మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే పటాన్ చెరులో ఇంటింటికీ మంచినీరు అందిస్తానని టీడీపీ-బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి అన్నారు. అందుకోసం కేంద్రం నుంచి రూ.200 కోట్ల నిధులను తీసుకువచ్చి మంజీరా నీటిని అందిస్తానని ఆయన చెప్పారు. తాను బీజేపీలో చేరినప్పటి నుంచి టీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని, బీజేపీ-టీడీపీ అభ్యర్థిగా ప్రజలు తనను గెలిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.