: ఆమె తల్లి పదానికే కళంకం
స్వార్థం పెరిగిపోతోంది. వ్యక్తిగత స్వేచ్ఛ కోసం బంధాలను ఏమీ కాకుండా వదిలేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెనుగొండ మండలం వడలి గ్రామంలో ప్రియుడి మోజులో పడి ఐదేళ్ల కొడుకును కిరాతకంగా చంపేసిందో తల్లి. స్థానికుల కథనం ప్రకారం ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ, తమ బంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో కన్నవాడని కూడా చూడకుండా ఆ చిన్నారిని అంతమొందించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.