: పాక్ లో విస్తరణకు ఐఎస్ఐఎస్ ప్రణాళికలు


అల్ ఖైదా బలహీనపడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుందని అందరూ భావించారు. అయితే, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) రూపంలో టెర్రరిజం విషసర్పం బుసలు కొడుతూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. ఇరాక్, సిరియాలకే ఇప్పటివరకు పరిమితమైన ఐఎస్ఐఎస్ పాకిస్థాన్ లోనూ వేళ్ళూనుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం భీతిగొలుపుతోంది. ఈ మిలిటెంట్ మూక గనుక పాక్ లో పాతుకుపోతే, పొరుగున ఉన్న భారత్ కు ఎప్పటికైనా ముప్పు తప్పదన్నది రక్షణ రంగ నిపుణుల అంచనా. తాజాగా, ఐఎస్ఐఎస్ కు సంబంధించిన కరపత్రాలు పెషావర్లోనూ, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోనూ విరివిగా పంచి పెట్టారు. జిహాద్ కు మద్దతివ్వాలంటూ ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. కొన్ని కాపీలను కొందరు పాత్రికేయులకు కూడా పంపారు.

  • Loading...

More Telugu News