: హైదరాబాదులో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
హైదరాబాదు నగరంలో చైన్ స్నాచర్లు ఇవాళ రెచ్చిపోయారు. సరూర్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో 9 తులాల బంగారు గొలుసులను రెప్పపాటులో దొంగలు ఎత్తుకెళ్లారు. నాగోల్ లో మరో స్నాచింగ్ కు యత్నించిన దొంగలను స్థానికులు అడ్డుకున్నారు. దాంతో, వారు కత్తితో బెదిరించి పలాయనం చిత్తగించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.