: ఏపీ పీఏసీ ఛైర్మన్ గా భూమా నామినేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన భూమాకు ఈ పదవి దక్కనుంది. లోక్ సభ, శాసనసభల్లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం ఆనవాయతీ. దీంతో ఏపీ పీఏసీ ఛైర్మన్ పదవి భూమాకు దక్కనుంది. భూమా నాగిరెడ్డి జగన్ కు అత్యంత నమ్మకమైన నేతగా ఉన్నారు. భూమా భార్య, దివంగత నేత శోభానాగిరెడ్డి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సంగతి తెలిసిందే.