: ఏపీ శాసనమండలి చీఫ్ విప్ గా నన్నపనేని


ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ గా టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించనున్నారు. ఇక మండలి విప్ గా అంగర రామమోహన్ ను నియమిస్తారు. వీరిద్దరూ టీడీపీలో సీనియర్ నాయకులే. అటు ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా టి.బ్రహ్మయ్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. ఈ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లోకి వెళ్లడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పలువురు ఖమ్మం జిల్లా నేతలతో బాబు సమావేశమై చర్చించారు.

  • Loading...

More Telugu News