: చైనా సరిహద్దు వెంబడి రోడ్ల నిర్మాణం చేపట్టనున్న భారత్


చైనా నుంచి ఎప్పటికైనా తీవ్ర ముప్పు ఉంటుందని గ్రహించిన భారత్, ఆ దేశ సరిహద్దు వెంబడి రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం చెబుతోంది. దీని ప్రకారం చైనా సరిహద్దులోనే గాకుండా, దేశంలో భద్రతా ముప్పు ఉన్న మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణం జరగనుందట. ఇందుకోసం, కేంద్రం పర్యావరణ నిబంధనలను కూడా సడలించి త్వరితంగా రోడ్ల నిర్మాణం చేపట్టనుందట. చైనా సరిహద్దు వెంట 4,056 కిలోమీటర్ల మేర మొత్తం 80 కొత్త రోడ్లను అరుణాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూకాశ్మీర్, ఇంకా కొన్నివైపుల రోడ్లను విస్తరించనున్నారు. కాగా, కొత్త ప్రాజెక్టులు కొన్ని నెలల్లో మొదలవుతాయని, ఇవి పూర్తయ్యేందుకు ఎనిమిది లేదా పది సంవత్సరాల వరకు పడుతుందని రక్షణ శాఖ అధికారి తెలిపారు. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, సరయిన రహదారులు లేకుంటే వ్యూహాత్మక రక్షణలో చైనాతో ఎలా పోటీపడతామని ప్రశ్నించారు. సరిహద్దును రక్షించుకుంటేనే మన దేశాన్ని రక్షించుకోగలమన్నారు.

  • Loading...

More Telugu News