: రసవత్తరంగా మారిన ఏపీ శాసనమండలి ఉపాధ్యక్షుడి ఎన్నిక... టీడీపీకి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి


ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉపాధ్యక్షుడి ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శాససమండలి సభ్యుడు చైతన్యరాజును టీడీపీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మిగతా పార్టీల సహాయంతో ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీ అభ్యర్థికి పోటీగా వైసీపీ సహాయంతో కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఏపీ శాసనమండలి ఉపాధ్యక్షుడి ఎన్నిక పోటాపోటీగా మారింది. దీని కోసం చెంగల వెంకట్రాయుడు, రుద్రరాజు పద్మరాజుల పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది.

  • Loading...

More Telugu News