: ఆటో డ్రైవర్లలో మంచోళ్లు కూడా ఉంటారు...!
ఆటో డ్రైవర్లంటే కిరాయి ఎక్కువ అడుగుతారని, ప్రయాణికుల్ని తప్పుదోవ పట్టిస్తారని, అత్యాచారాలు వంటివి చేస్తారనే భయాలు జనాల్లో పేరుకుపోయాయి. వాటిన్నింటినీ తప్పని నిరూపిస్తూ ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి మారు పేరుగా నిలిచాడు. తనకు దొరికిన సుమారు రెండు లక్షల రూపాయల విలువైన వస్తువుల కోసం ఆశపడకుండా.. బ్యాగ్ను పోలీసులకు అప్పగించి ప్రశంసలందుకున్నాడు. హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ప్రయాణికుడు తన బ్యాగ్ను ఆటోలోనే మరచి వెళ్లిపోయాడు. అతనెళ్లిపోయాక ఆటోలో బ్యాగ్ను గుర్తించిన ఆటో డ్రైవర్ దాని యజమానికి అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ఆచూకీ తెలియకపోవడంతో, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ బ్యాగ్ అప్పగించాడు. అతను బ్యాగ్ పోలీసులకు అప్పగించిన సమయంలో అందులో మూడు తులాల బంగారం గొలుసు, లక్ష రూపాయిల విలువైన పట్టు చీరలు ఉన్నాయి. దీంతో అతని నిజాయతీకి అందరూ అభినందించారు.