: 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్ భారత్ కైవసం
బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. భారత ఓపెనర్లు రహానే 106, శిఖర్ ధావన్ 97 (నాటౌట్) చెలరేగి ఆడటంతో లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. సెంచరీ పూర్తి చేసిన అనంతరం రహానే అవుట్ కావడంతో విరాట్ కోహ్లి 1 (నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోర్ 212/1 కాగా, ఇంగ్లండ్ స్కోర్ 206 ఆలౌట్. ఐదు వన్డేల సిరీస్ లో 3-0 ఆధిక్యంతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత్ వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.