: పది కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలేదు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయిందని అన్నారు. కన్వీనర్ కోటాలో 103 కళాశాలల్లో వంద శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. న్యాయ సలహాను అనుసరించి రెండవ దశ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News