: తెలుగు సినిమాలకే కాదు... నాకు కూడా చాలా నేర్పారు: అనిల్ కపూర్
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు దివంగత బాపు తన గురువని ప్రముఖ బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ తెలిపారు. బాపు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన ముంబై నుంచి చెన్నై వచ్చారు. బాపు పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ లోకానికి తనను పరిచయం చేసింది బాపూయేనని తెలిపారు. ఆయన తెలుగు సినీ రంగానికి చాలా నేర్పితే, తన సినీ ప్రయాణానికి మరిన్ని మెళుకువలు నేర్పారని అన్నారు. ఆయన మృతి భారతీయ సినీరంగానికి తీరని లోటని అనిల్ కపూర్ తెలిపారు. ఆయన గీసిన బొమ్మల్లో భారతీయ శైలి నిండిపోయి ఉంటుందని అనిల్ కపూర్ స్పష్టం చేశాడు.