: మెదక్ ఉప ఎన్నికకు బెంగళూరు ఈవీఎంలు


మెదక్ లోక్ సభ ఉపఎన్నికకు ఎలక్షన్ కమీషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాదులో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ, మెదక్ ఎన్నికల్లో వినియోగించేందుకు బెంగళూరు నుంచి ఈవీఎంలు తెప్పిస్తున్నామన్నారు. మెదక్ ఉప ఎన్నికలో డీఈఎల్ కంపెనీకి చెందిన ఈవీఎంలు వాడుతున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో భద్రత నిమిత్తం 17 కంపెనీల బలగాలను మోహరించనున్నామని ఆయన వెల్లడించారు. రేపటి నుంచి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయనున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News