: ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తో బీసీసీఐ ఐదేళ్ళ ఒప్పందం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భవిష్యత్ అవసరాలపై దృష్టి సారించింది. దేశంలో పేస్ బౌలింగ్ వనరులను వృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఇప్పటికే చెన్నై కేంద్రంగా యువ పేసర్లను తీర్చిదిద్దుతున్న ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తో బీసీసీఐ తాజాగా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, విఖ్యాత పేసర్ గ్లెన్ మెక్ గ్రాత్ తో భారత ఫాస్ట్ బౌలర్లకు శిక్షణ ఇప్పించనున్నారు. ఈ ఒప్పందం ఐదేళ్ళపాటు అమల్లో ఉంటుంది. ఈ మేరకు ఇరువర్గాలు సంతకాలు చేశాయి. తమ ప్రయత్నం భారత క్రికెట్ కు ఎంతగానో లాభిస్తుందని బీసీసీఐ మధ్యంతర అధ్యక్షుడు శివలాల్ యాదవ్ అన్నారు.