: ప్రియుడు మోసం చేశాడని గొంతు కోసుకున్న యువతి
ప్రియుడు మోసం చేయడం తట్టుకోలేక ఓ యువతి బ్లేడుతో గొంతు కోసుకుంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోని బి.కొత్త కోట పోలీస్ స్టేషన్ వద్ద యువతి ఈ దారుణానికి ఒడిగట్టింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని ఆవేదన చెందిన యువతి బ్లేడుతో తన గొంతు కోసుకుంది. దీనిని గమనించిన పోలీసులు యువతిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పిందని, అయినప్పటికీ యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.