: 'ఎంటీవీ'కి హిందూ జనజాగృతి సమితి సెగ


గోవాకు చెందిన హిందూ జనజాగృతి సమితి (హెచ్.జే.ఎస్) ఎంటీవీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎంటీవీలో ప్రసారమయ్యే పాప్యులర్ రియాలిటీ షో 'స్ప్లిట్స్ విల్లా'పై నిషేధం విధించాలని హెచ్.జే.ఎస్ డిమాండ్ చేస్తోంది. ఆ కార్యక్రమంలో పొట్టి స్కర్టులు, బికినీలను ప్రోత్సహిస్తూ, భారత సంస్కృతిని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని సమితి ఆరోపించింది. టీవీ కార్యక్రమాలకు కూడా సెన్సార్ వ్యవస్థ ఉండాలని కోరింది. అంతకుముందు ఈ రియాలిటీ షో లో పాల్గొన్న స్కార్లెట్ రోజ్ అనే గోవా మోడల్ స్వేచ్ఛ గురించి ప్రస్తావించింది. దీనికి హెచ్.జే.ఎస్ ప్రతినిధి రమేశ్ షిండే అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమె చెబుతున్న స్వేచ్ఛా భావనలు పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినవని, భారత్ లో వాటికి స్థానం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News