: కేసీఆర్ రైతాంగం సమస్యలను పట్టించుకోవడం లేదు: కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగం సమస్యలను పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ హైదరాబాదులో కూర్చుని జిల్లాలను సింగపూర్, లండన్ చేస్తానని అంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఉన్నది జగ్గారెడ్డికి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.