: మీ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ త్వరగా అయిపోతుందా... అయితే, పరిష్కారం ఇదిగో!
స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? మీరు వాడే యాప్ లతో స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ తొందరగా అయిపోతుందా? దీనికి పరిష్కారంగా ఓ యాప్ ని పరిశోధకులు సిద్ధం చేశారు. అమెరికాలో న్యూయార్క్ కు చెందిన ఓ పరిశోధకుడు కొన్న రకాల యాప్ ల వల్లే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నట్టు గుర్తించారు. దీంతో ఆయన ఓ కొత్త యాప్ ను రూపొందించారు. ఇది ఏ యాప్ ఎంత ఛార్జింగ్ ఖర్చు చేస్తుందో తెలుపుతుంది. దీంతో పాటు మీరు ఏ యాప్ వాడితే బాగుంటుందో గూగుల్ ప్లేలో చూపిస్తుంది. అలాగే ప్రతి యాప్ కి కలర్ కోడ్ తో రేటింగ్ ఇస్తుంది. అందువల్ల మనం ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే బాగుంటుందో నిర్ణయించుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే మనం స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్న యాప్ లు ఎంత ఛార్జింగ్ తీసుకుంటున్నాయనే విషయం కూడా మనకి తెలుపుతుంది. దీని వల్ల తక్కువ ఛార్జింగ్ ఖర్చుచేసే యాప్ లు వినియోగించుకుని స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ లైఫ్ పెంచుకోవచ్చని ఆయన వెల్లడించారు.