: బర్మింగ్ హామ్ వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్


బర్మింగ్ హామ్ లో జరుగనున్న వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ - భారత్ జట్ల మధ్య జరిగే నాల్గో వన్డేలోనూ సత్తా చాటి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ లో ఖాతా తెరవాలని శతధా ప్రయత్నిస్తోంది. ఐదు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగతా రెండు మ్యాచుల్లోనూ భారత్ నెగ్గి 2-0 ఆధిక్యంతో ఉన్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో నాల్గో వన్డే ప్రారంభమవుతోంది.

  • Loading...

More Telugu News