: వృద్ధ కళాకారుల ఆర్థిక సాయం కోసం రూ.1.62 కోట్లు మంజూరు
వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. వారికి నెలానెలా 500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిశ్చయించింది. అందుకోసం రూ.1 కోటి 62 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 3,254 మంది వృద్ధ కళాకారులకు దీంతో లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే మార్చి నెల వరకు ఆర్థిక సాయం కోసం ఈ నిధులను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.