: హింసాత్మకంగా మారిన చెరకు రైతుల ఆందోళన
విజయనగరం జిల్లాలో చెరకు రైతులు తలపెట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఎన్ సీఎస్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కోపోద్రిక్తులైన రైతులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో... పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు రైతులు, పోలీసులు గాయపడ్డారు.