: సచిన్ కు గుడి కడుతున్నారు!
భారత్ లో ఉన్న క్రికెట్ మతస్తులకు సచిన్ టెండూల్కర్ దేవుడు! ఇప్పుడాయనకు గుడి కట్టాలని వీరభక్తులు నిర్ణయించారు. వివరాల్లోకెళితే... బీహార్లోని అతార్వాలియా ఓ చిన్న పట్టణం. అక్కడ 10 అడుగుల ఎత్తున్న సచిన్ విగ్రహం దర్శనమిస్తుంది. మార్బుల్ స్టోన్ తో తయారైందా విగ్రహం. దీని బరువు 850 కేజీలుగా కాగా, ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో రూపొందించారు. వరల్డ్ కప్ చేతబట్టుకుని ఉన్న రీతిలో సచిన్ దర్శనమిస్తాడక్కడ. ఇప్పుడా ప్రదేశంలో ఓ గుడి కట్టాలని నిర్ణయించారు. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ ఆరాధ్య క్రికెటర్ సచిన్ కు ఆలయం నిర్మించాలని, అందులో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సదరు వీరాభిమానులు సంకల్పించారు. ఈ ప్రతిపాదిత ఆలయానికి సమీపంలో భోజ్ పురి నటుడు మనోజ్ తివారీ స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియం కూడా నిర్మించనున్నారట.