: మరోసారి తండ్రి కాబోతున్న వసీం అక్రం
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రం మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. "నాకు, నా భార్య షనైరాకు త్వరలో తొలి బేబీ పుట్టబోతోంది. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా థ్రిల్ గా భావిస్తున్నాము. శుభాకాంక్షలు తెలిపిన, మా కోసం ప్రార్థనలు చేసిన అందరికీ నా కృతజ్ఞతలు" అంటూ ఈ పాక్ మాజీ కెప్టెన్ ట్వీట్ చేశాడు. కాగా, 1995లో అక్రంకు, హుమాకు వివాహం అయింది. వారిద్దరికీ ఇద్దరు కుమారులున్నారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో 2009లో హుమా చనిపోయింది. దాంతో, గతేడాది ఆగస్టు 12న ఆస్ట్రేలియాకు చెందిన షనైరాను అక్రం రెండో వివాహం చేసుకున్నాడు.