: తైకో డ్రమ్స్ వాయించి అబ్బురపరిచిన మోడీ


ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటన నాలుగోరోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టోక్యోలోని టీసీఎస్ జపాన్ విభాగంలో సాంకేతిక, సాంస్కృతిక అకాడమీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతో ఏర్పాటు చేసిన తైకో డ్రమ్స్ వాయిద్య కచేరీలో మోడీ కూడా సరదాగా పాలుపంచుకున్నారు. ముందుగా ఇద్దరు కళాకారులు డ్రమ్స్ మోగించగా, తాను కూడా వాయిస్తానని మోడీ అడిగారు. వెంటనే ఓ డ్రమ్మర్ తో పోటీగా మోడీ లయబద్ధంగా, ఎంతో ఉత్సాహంతో డ్రమ్స్ వాయించారు. తన ప్రదర్శనతో అక్కడున్న వ్యాపారవేత్తలందరినీ మోడీ అబ్బురపరిచారు.

  • Loading...

More Telugu News