: ఏపీ రాజధానిపై సీఎం ప్రకటన వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చేయాల్సిన ప్రకటన వాయిదా పడింది. అందుకు సంబంధించిన పత్రాలు సిద్ధంకాకపోవడం, ఈరోజు అష్టమి అన్న పలు కారణాల నేపథ్యంలో ప్రకటనను ఎల్లుండికి వాయిదా వేశారు. తొందరపడి ప్రకటన చేసేకన్నా శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిశీలించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, విజయవాడ, గుంటూరు మధ్యలోనే ఏపీ రాజధాని ఉంటుందని నిన్న (సోమవారం) జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.