: బాపు మరో రూపంలో జన్మించి తెలుగుజాతికి వెలుగునివ్వాలి: రోశయ్య
బాపు భౌతికకాయానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ బాపులాంటి మహామనిషి మరొకరు పుట్టరని అన్నారు. బాపు మరో రూపంలో జన్మించి తెలుగు జాతికి వెలుగునివ్వాలని ఆయన కోరుకున్నారు. సినీదర్శకుడిగా బాపు తెలుగుప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేశారని ఆయన అన్నారు. బాపు కుటుంబ సభ్యులకు, అభిమానులకు రోశయ్య ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.