: పరారీలో రైల్వే మంత్రి కుమారుడు కార్తీక్ గౌడ్... వెంటనే లొంగిపోవాలని పోలీసుల అల్టిమేటం
కేంద్రమంత్రి సదానండగౌడ కుమారుడు కార్తీక్ గౌడ్ ను బెంగళూరు పోలీసులు వెంటనే లొంగిపోవాలని సోమవారం అల్టిమేటం జారీ చేశారు. ఈ బుధవారం లోగా లొంగిపోకపోతే బలవంతంగానైనా అరెస్ట్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ప్రేమ పేరిట తనను పెళ్లి చేసుకుని... ఆ తర్వాత వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడంటూ కన్నడ వర్థమాన నటి మైత్రేయ గతవారం బెంగళూరు పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి కొడుకు కావడంతో చాలాసేపు తర్జనభర్జనలు పడి చివరికి పోలీసులు అతడిపై 420 కేసును నమోదు చేశారు. అదే రోజు పోలీసులు కార్తీక్ గౌడ్ కు నోటీసులు పంపగా... ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అతడు అదృశ్యమయ్యాడు. అటుపైన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ ఈవారంలోనే జరగనుంది. ఈ లోపల అతడిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలన్న ఆలోచనతో పోలీసులు తాజా హెచ్చరిక జారీ చేశారు.