: కొనసాగుతోన్న ఏపీ మంత్రివర్గ సమావేశం... రాజధాని పైనే చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలుగా కొనసాగుతోంది. రాజధాని ఎక్కడ? అనే అంశంపైనే కేబినెట్ సుదీర్ఘంగా చర్చిస్తోంది. రాజధానిపై ప్రభుత్వం ముందు నుంచీ చెపుతున్న దానికి భిన్నంగా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వంలోని ముఖ్యులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతోందని ముందు నుంచీ చెబుతూ వచ్చారు. కానీ, కమిటీ అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం మంచిది కాదని చెప్పింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలన్న దృఢమైన అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ అంశం చాలా సున్నితమైనది కావడంతో... చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో మంత్రి మండలి ఉంది. తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసి, నిదానంగా అలవాటు పడిన తర్వాత దానిని శాశ్వత రాజధాని చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.