: సికింద్రాబాదు ఐడీహెచ్ కాలనీలో కేసీఆర్ పర్యటన


సికింద్రాబాదులోని ఐడీహెచ్ కాలనీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఇటీవల వర్షాలకు ఇళ్లు కూలిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఎప్పుడు కూలుతాయో తెలియని స్థితిలో ఐడీహెచ్ కాలనీ ఇళ్లు ఉన్నాయని అన్నారు. కూలిపోతున్న ఇళ్లను ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఆయన చెప్పారు. జంటనగరాల్లో ఇలాంటి బస్తీలు చాలా ఉన్నాయని, వాటిని పునర్నిర్మిస్తామని ఆయన అన్నారు. రేపటి నుంచి పనులు జరపాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 5 నెలల్లో కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు చెప్పానన్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఐడీహెచ్ కాలనీని మోడల్ కాలనీగా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు.

  • Loading...

More Telugu News